మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత మన స్తత్వంతో కొట్టు–మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేదు. ‘మా’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను 48 గంటల్లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు నా సిబ్బంది ద్వారా పంపిస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ట్వీట్ నాగబాబు సోషల్‌మీడియాలో రెస్పాండ్ అయ్యారు.
మంచు విష్ణు గెలుపు..‘మా’కు రాజీనామా చేసిన నాగబాబు!
![](https://tollywoodhub.com/wp-content/uploads/2021/10/Naga1.jpg)
Leave a comment
Leave a comment