‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు నెగ్గడం పట్ల చిరంజీవి సోషల్‌మీడియాలో రెస్పాండ్ అయ్యారు. మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్‌తో పాటు మిగతా ‘మా’ ఎన్నికల్లో గెలిచిన విజేతలు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. కొత్తగా ఎన్నికైన ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టుల అందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచిన మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని ట్వీట్ చేశారు.