మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత మోహన్‌బాబు మీడియా ముందుకు
వచ్చి మాట్లాడుతూ– ‘‘మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సభ్యులందరూ కళామతల్లి బిడ్డలు. నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ జరగకుండ ఏకగ్రీవం కావాలి. మా వివాదాలకు ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టండి. మంచు విష్ణు అనుమతి లేకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లి ఏదీ పడితే అది మాట్లాడవద్దు. కృష్ణ, కృష్ణంరాజు, నా సోదరుడు బాలయ్య అలాగే నా ఆత్మీయుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఆశీర్వాదాలు నా కుమారుడు విష్ణుకు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీర్వాదాలు కూడా విష్ణు కావాలన్నారు మోహన్‌బాబు.
మళ్లీ ‘మా’ ఎన్నికలు పెట్టొద్దు..పెద్దల అంగీకారంతో ఏకగ్రీవం కావాలి: మోహన్‌బాబు


Leave a comment
Leave a comment