టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’. తమిళ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నుట్లుగా గతంలో ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల దసరాకు వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. కానీ సినిమా షూటింగ్ మాత్రం మెల్లిగా తుదిదశకు చేరుకుంటుంది.
ఈ దశలో తన నెక్ట్స్ ఫిలింపై చిరంజీవి ఫోకస్ పెట్టారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది. అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ చెప్పిన కథ విన్నారు చిరంజీవి. కానీ ఎందుకో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దర్శక–నటుడు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చెప్పిన కథ కూడా చిరంజీవిని మెప్పించలేపోయింది. అయితే రీసెంట్గా తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ చెప్పిన కథ చిరంజీవికి నచ్చిందట. కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే..ఈ సినిమాను చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల నిర్మిస్తారట. అదీ కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌పై. అయితే ఈ బ్యానర్లో రామ్‌చరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబరు 150’, ‘సైరా:నరసింహారెడ్డి’, ‘ఆచార్య’ ‘గాడ్‌ఫాదర్’ వంటి సినిమాలు వచ్చాయి. ఖైదీనెంబరు 150 తప్ప మిగిలిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్సే. మరి..సుష్మితా నిర్మాణంలో అయిన చిరంజీవికి లక్ కలిసి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక నిర్మాతగా సుష్మితా కొణిదెల గోల్డ్బ్యాక్స్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన తొలి చిత్రం‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఈ చిత్రంలో సంతోష్‌శోభన్ హీరోగా నటించారు.