ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌పై దర్శక–నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. తాను మూడు గంటలపాటు పాల్గొన్న సెమినార్‌లోని ఓ నిమిషం క్లిప్‌ను మాత్రమే రిలీజ్ చేసి తనను అనవసరంగా ట్రోల్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సెమినార్లో చిన్న సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందని, ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు తనపై దారుణంగా కామెట్స్ చేయడం చాలా బాధ కలిగించదని తమ్మారెడ్డి భరద్వాజ వాపోయారు. ఒకరు అకౌంట్స్(దర్శకుడు కె.రాఘవేంద్రరావును ఉద్దేశిస్తూ..), మరొకరు అమ్మా మెగుడు(నటుడు–నిర్మాత నాగబాబును ఉద్దేశిస్తూ..) అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, వాళ్ల సంస్కారం, తన çసంస్కారం వేరని ఆయన చెప్పారు.
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం"
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
తాను ఐడెంటిటీ క్రైసిస్ తో ఇబ్బంది పడటం లేదని, తనను టార్గెట్‌గా చేసుకుని అసభ్యంగా మాట్లాడుతూ కొందరు ఐండెంటిటీ కోసం ఇలా చేస్తున్నారా? అని అనిపిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ్ ఆరోపించారు. ఇప్పుడు ఈవిషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందనే అనుకుంటున్నారు ఇండస్ట్రీ వాసులు, నెటిజన్లు.
or/