జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) కెరీర్‌లో రూపొందుతున్న 30వ సినిమాకు దేవర (Devara) టైటిల్ ఖరారు చేశారు. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. జాన్వీకపూర్ ఈ సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినినేని సుధాకర్‌బ్యానర్ యువసుధ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమానునిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో అగ్రశ్రేణి హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలోప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయాల నుకుంటున్నారు.
దేవర టైటిల్ ఎవరిది?
పవన్‌కళ్యాణ్ కోసం నిర్మాత– నటుడు– బండ్లగణేష్ ‘దేవర’ టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌ను రెన్యూవల్ చేసుకోవడం బండ్ల గణేష్ మర్చి పో యారు. ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివ ‘దేవ ర’ టైటిల్‌ను తీసుకున్నారు. ‘దేవర’ అంటే దేవుడు అని మీనింగ్.
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ❤️ https://t.co/Ad1wIqIfYB
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023
ఎన్టీఆర్ తర్వాతి సినిమాలు
‘దేవర’ సినిమా మేజర్ షూటింగ్ ఓ కొలిక్కి రాగానే జూనియర్ ఎన్టీఆర్ హిందీ ఫిల్మ్ ‘వార్ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. బాలీవుడ్ టాప్‌హీరోస్‌లో ఒకరైన హృతిక్‌రోషన్ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రధారి. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. యశ్‌రాజ్ ఫిలింస్‌పై ఆదిత్యాచోప్రా ఈ సినిమాను నిర్మించనున్నా రు. యశ్‌రాజ్ ‘స్పై’ ఫ్రాంచైజీలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ చిత్రంలో పాటు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చేస్తున్నారు ప్రశాంత్‌నీల్. ఇది పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారాయన. 2024 మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.