సలీమ్, కిల్లర్, బిచ్చగాడు వంటి సినిమాలతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ము ఖ్యంగా తల్లిసెంటిమెంట్‌తో రూపొందిన బిచ్చగాడు సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులుకు చాలా దగ్గరైంది. అయితే సిస్టర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు 2’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయ్ఆంటోనీయే దర్శకుడు, హీరో, ఎడిటర్, మ్యూజిక్డైరెక్టర్. మరి..బిచ్చగాడు 2 సినిమా ఎలా ఉందో ఓ సారి చూడండి.
కథ: పిచ్చైకారన్ 2 (తెలుగులో ‘బిచ్చగాడు’ 2)
ప్రధానతారాగణం: విజయ్ ఆంటోనీ, కావ్యాథాపర్, రాధారవి, యోగిబాబు
దర్శకత్వం, ఎడిటింగ్, సంగీతం: విజయ్ ఆటోనీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
విడుదల: 19 మే 2023
కథ
భారతదేశంలో ఉన్న అత్యంత ధనికుల్లో ఏడోస్థానంలో ఉన్న వ్యక్తి వీజీ గ్రూప్స్ అధినేత గురుమూర్తి వైజాగ్ లో నివాసం ఉంటుంటాడు. ఆయన కుమారుడు విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ..Vijay Antony ) లక్షకోట్ల రూపా యాలకు వారసుడు. విజయ్ గురుమూర్తి వీజీ గ్రూప్స్ సీఈవో అరవింద్(దేవ్‌గిల్), ఆడిటర్ చైతన్య, ఫ్యామిలీ డాక్టర్ శివలు కలిసి కుట్ర పన్నుతారు. విజయ్గురుమూర్తిని చంపి, బ్రెయిన్ ట్రాన్స్ప్లాన్టేషన్ చేసి వారికి అనుకూలమైన వ్యక్తిని వీజీ గ్రూప్స్ అధినేతగా నియమించు కోవాలనుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా రాజమహేంద్రవరంలో బిచ్చగాడిగా ఉంటూ ఏడేళ్ల వయసులో తప్పిపోయిన తన చెల్లెలు రాణిని వెతుకుతున్న సత్యను కిడ్నాప్ చేసి బ్రెయిన్ టాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు అరవింద్ అండ్ గ్రూప్. విజయ్గురుమూర్తి స్థానంలోకి వచ్చిన సత్య..అరవింద్ అండ్ గ్రూప్‌కు సానుకూలంగా ఉన్నాడా? తప్పిపోయినతన చెల్లి రాణిని సత్య చేరుకోగలిగాడా? విజయ్గురుమూర్తి ప్లేస్‌లోకి సత్య వచ్చినప్పుడు…వీజీ గ్రూప్స్సెక్రటరీ, విజయ్గురుమూర్తి ప్రేయసి హేమ (కావ్యా థాపర్) ఎలా రెస్పాండ్ అయ్యారు? విజయ్ గురుమూర్తి ప్లేస్‌లో ఉన్నది సత్య అనే అని ప్రపంచానికి తెలిసినప్పుడు ఏటువంటి పరిణామాలు జరిగాయి? అన్నదే కథ.
విశ్లేషణ
ఓ పెద్ద ధనవంతుడు. యజమానిగా ఉన్న అతన్ని చంపి ఆస్తి కాజేయాలనుకునే ఓ క్రిమినల్గ్రూప్. ఆస్తిని చేజిక్కించుకోవాలని యజమానిని చంపి, అతని ప్లేస్‌లో తమకు అనుకూలమైన వాడిని తీసుకువచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే క్రిమినల్ గ్రూప్‌కు…కొత్తగా వచ్చిన వ్యక్తి ఎదురుతిరగడం….ఈ స్టోరీలైన్‌పై వచ్చిన కథలు బోలేడు ఉన్నాయి. ఒకప్పటి ‘రౌడీఅల్లుడు’, ‘భార్గవరాముడు’ నుంచి మొన్నటివరకు వచ్చినప్రభాస్ ‘బిల్లా’, నాని ’జెంటిల్మన్’ చిత్రాలు ఈ కోవలోనివే. బ్రెయిన్ట్రాన్స్ప్లాంటేషన్ సబ్జెక్ట్‌తో కూడా రీసెంట్గా ‘ఇస్మార్ట్‌శంకర్’ లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఆ కథల్లో క్రిమినల్ గ్రూప్స్ తీసుకుని వచ్చే వ్యక్తి తాలుకూ గతం పూర్తిగా వారికి తెలిసి ఉంటుంది. కానీ ‘బిచ్చగాడు 2’ వేరు.
అరవింద్ అండ్ గ్రూప్కుసత్య గతం పూర్తిగా తెలియదు. ఓ దర్శకుడిగా విజయ్ ఆంటోనీ ఆలోచన ఇక్కడ ఒకింత సక్సెస్ అయ్యిం దనే చెప్పుకోవాలి. విజయ్ గురుమూర్తి ప్లేస్‌లోకి సత్య వచ్చిన తర్వాత అందరూ ఊహించే విధంగావిజయ్గురుమూర్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. సత్య పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ సాగడం కొత్తదనం. ఏడేళ్ల వయసులో సత్య, అతని చెల్లెలు రాణి పడ్డ కష్టాలు, వీరిద్దరి మధ్య ఉన్న భావోద్వేగపు సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. విజయ్గురుమూర్తి ప్లేస్‌లోకి సత్య వచ్చిన తర్వాతపేదవారి కోసం యాంటి బికిలీని స్టార్ట్ చేయడం, ఈ ప్రక్రయలో భాగంగా ముఖ్యమంత్రితోనే గొడవకు దిగడం వంటి సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కు నచ్చుతాయి. ముఖ్యంగా రేప్ నిందుతులను కొట్టేఫైట్, సెకండాఫ్‌లో బోర్డ్ రూమ్ ఫైట్, ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్‌లో జనరల్ ఆడియన్స్కుకిక్ ఇస్తాయి. క్లైమాక్స్ సీన్స్‌లో కోర్టులో ఉండే ట్విస్ట్, చివర్లో ఉండే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆలరిస్తాయి.
పెర్ఫార్మెన్స్
సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నా సినిమా అంత విజయ్ఆంటోనీపైనే నడుస్తుంది. విజయ్ గురు మూర్తి..ముఖ్యంగా సత్య పాత్రలో విజయ్ ఆంటోనీ బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకు తానే ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావడంతో ఈ టెక్నికల్ అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. సాంగ్స్ ఒకే. ముఖ్యంగా చెల్లి వినవే.. పాట ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక హీరోయిన్గాకావ్యథాపర్కు పెద్ద యాక్టింగ్ స్పేస్ లేదు. దేవ్‌గిల్ ఉన్న పాత్ర పరిధిలో ఒకే అనిపించాడు.
మధ్య మధ్యలో వచ్చే యోగిబాబు కామెడీ సీన్స్ ఓకే. కానీ చెల్లల్ని వెతక్కుండా..మనం మంచి చేస్తే ఆమె మన దగ్గరకు తనే వస్తుందని ఓ సాధువు చెప్పిన మాటలను పూర్తిగా సత్య నమ్మడం, దీంతో తన చెల్లెలి గురించి అసలు వెతకకుండ ఉండటం కాస్త మైనస్‌గా అనిపించింది. అలాగే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినంత మాత్రాన ఓ వ్యక్తిని అదుపులో ఉంచుకోవచ్చన్న ఆలోచన కూడా రాంగ్గే. వ్యక్తిని కంట్రోల్ చేయ వచ్చు కానీ అతన్ని ఆలోచనలను ఎవరూ కంట్రోల్ చేయలేరు కదా. సినిమా స్టార్టింగ్ 20 నిమి షాలు, ఇంట్రవెల్ మరో 15 నిమిషాలు ఓపిగ్గా చూడగలిగితే ఈ ఎమోషనల్ బిచ్చగాడు ఆడియన్స్‌కు నచ్చేస్తాడు.