పవన్‌కళ్యాణ్ (Pawankalyan), సాయిధరమ్‌తేజ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో: ది అవతార్’(Bro:the Avthar). సముద్రఖని దర్శకుడు. తమిళ హిట్ ఫిల్మ్ ‘వినోదాయ సిత్తమ్’కు తెలుగు రీమేక్‌గా ‘బ్రో: ది అవతార్’ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన వంతు షూటింగ్ పార్టును కంప్లీట్ చేశారు పవన్‌కళ్యాణ్. ఈ సినిమాను జూలై 28న విడుదల చేయా లనుకుంటున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఈ సినిమా కాకుండ పవన్‌కళ్యాణ్ మరో మూడు సినిమాలు చేస్తున్నారు. రన్ రాజా రన్, సాహో వంటి సినిమాలను తీసిన యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా చేస్తున్నారు. డీవీవీదానయ్య నిర్మాత. ఇందులో ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. డిసెంబరులో క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఉస్తాద్ భగత్‌సింగ్
గబ్బర్‌సింగ్ వంటి సూపర్‌డూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపైనవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా స్పీడ్‌గానే జరుగుతోంది. వచ్చే ఏడాది సం క్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
హరి హరవీరమల్లు
‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘బ్రో: ది అవతార్’ సినిమాల కంటే ముందు పవన్‌కళ్యాణ్ కమిటైన చిత్రం హరిహారమీరమల్లు. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. 19వ శతాబ్దంలో జరిగేఈ చారిత్రాత్మక చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించిన ఈ సినిమాను
2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సెకండాఫ్ విషయంలో క్రిష్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య సయోధ్య కుదర్లేదన్నది ఫిల్మ్‌నగర్ టాక్.కానీ ఏలాగో అలా ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్మాత ఏఎమ్ రత్నం భావిస్తాన్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.