Hanumancollections: భారతీయ సినిమాల్లో అత్యధికగ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన చిత్రం ‘దంగల్’. ఆమిర్‌ఖాన్ హీరోగా 2016లో విడుదలైన సినిమా ఇది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, నెంబర్ 1 స్థానంలో ఉంది. నిజానికి ఈ ప్లేస్‌లో ‘బాహుబలి 2’ ఉండాల్సింది. కానీ ‘దంగల్’ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ‘దంగల్’ సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు 120 కోట్ల రూపాయల కలెక్షన్స్ జపాన్ బాక్సాఫీస్ నుంచి వచ్చాయి. అందుకే అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ థర్డ్ ప్లేస్‌లో ఉంది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ‘హను–మాన్’ సినిమా కూడా ఫాలో కావాలనుకుంటుంది. విడుదలైన 20 రోజుల్లోనే దాదాపు 265 కోట్ల రూపాయలగ్రాస్ కలెక్షన్స్‌తో ‘హను–మాన్’ చిత్రం దూసుకెళ్తోంది. ఈ తరుణంలో ‘హను– మాన్’ సినిమాను విదేశీ భాషల్లో విడుదల చేయాలని ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్‌శర్మ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టారు. అంతేకాదు..‘హను–మాన్’ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయాలని ప్రశాంత్‌వర్మ వర్క్ స్టార్ట్ చేశారు. త్రీడీ హను–మాన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడ విడుదల చేస్తారట. ఈ సంఘనటలే జరిగి, విదేశాల్లో, త్రీడీ రిరిలీజ్లో ‘హను–మాన్’కు ఆదరణ లభిస్తే కలెక్షన్స్ మరింత పెరుగుతాయి. రికార్డ్స్ డబుల్ అవుతాయి. నిజానికి హను–మాన్ సినిమాను విదేశీభాషల్లోనూ, త్రీడీలోనూ ఒకేసారి విడుదల చేయాలనుకున్నారు ప్రశాంత్‌వర్మ. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా కుదర్లేదు. ఇప్పుడు హనుమాన్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్లాన్‌ను ఆన్ చేశారు ప్రశాంత్‌వర్మ. ఇక ‘హను–మాన్’ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటించగా, కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు.