Vettaiyan: రజనీకాంత్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’ (Vettaiyan). ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అమితాబ్‌బచ్చన్, రానా, ఫాహద్‌ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్, మంజువారియర్ కీలక పాత్రధారులు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కడపలో జరుగుతోంది. జమ్మల మడుగు నియోజకవర్గం, ఎర్రగుంట్ల సమీపంలోని ఓ నాపరాయి గనిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగు తోంది. రజనీకాంత్ పాల్గొనగ, కీలక సన్నివేశాలను తీస్తున్నారు.
ఫేక్ ఎన్కౌంటర్స్ ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రంలో ముస్లిం పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక రజనీకాంత్ ఓ కీలక పాత్ర చేసిన‘లాల్ సలామ్’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుంది. సన్‌పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.