‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం వస్తుంది. ఈ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ చిత్రం ఇది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. రచయిత భూపతిరాజా ఈ సినిమాకు కథను అందించారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రస్తుతం గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన 30వ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఆ దర్శకుడితో గోపీచంద్ మూడో సినిమా
Leave a comment
Leave a comment