బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బయోపిక్ గురించి ఎప్పట్నుంచో వార్తుల వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా తన బయోపిక్ వెండితెరపైకి రానున్నదన్న విషయాన్ని గంగూలీయే వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.తన బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌కపూర్ అయితే బాగుటుందని ఈ ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ కోరారట. అయితే తన బయోపిక్కు ఇంకా టైమ్ ఉందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు మాత్రమే జరుగుతున్నాయని కొంతకాలం తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని గంగూలీ చెప్పారట. మరి..ఆస్ట్రేలియా కోచ్ గ్రేగ్ ఛాపెల్‌తో ఉన్న గొడవలు, గాడ్ ఆఫ్ క్రికెటర్‌గా చెప్పుకునే సచిన్‌తో తనకు ఉన్న కొన్ని అభిప్రాయభేదాలు, 2003లో ఆస్ట్రేలియాలోతో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో గంగూలీ సారథ్యంలోని భారతజట్టు ఓటమి వంటి అంశాలను ఈ బయోపిక్‌లో ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా గంగూలీ సాధించిన ఘనతలు కూడా చాలానే
ఉన్నాయి. 2002లో ఇదే రోజున (జూలై 13)న ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్వేస్ట్ ట్రోఫీ ఫైనల్లో గెలిచి బాల్కనీలో నుంచి షర్ట్ విప్పి గంగూలీ కేరింతలు కొట్టిన సంఘటనను కూడా ఎవరు అంత సులభంగా మర్చిపోలేరు. అలాగే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ ఎన్నిక కావడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంద నే చెప్పవచ్చు. అంతేకాదు..కోవిడ్ సమయంలో కూడా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన గంగూలీ ప్రతిభ గురించి ఎంత చెప్పిన తక్కువే.
దాదా బయోపిక్ ఫిక్స్
Leave a comment
Leave a comment