ఆరుపదుల వయసుదాటినా కూడా చిరంజీవికి సినిమాల పట్ల ఉన్న ప్రేమ, తపన ఏ మాత్రం తగ్గలేదు. ప్రజెంట్ చిరంజీవి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయంటే ఈ వయసులో కూడా చిరంజీవి ఎంత ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారో తెలుస్తోంది. అంతేకాదు కోవిడ్ పరిస్థితులకు భయపడి మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, నితిన్ వంటి హీరో లు షూటింగ్‌కు నో చెప్పారు.కానీ చిరంజీవి ధైర్యం గా సెట్స్‌లో పాల్గొంటున్నారు. మెహర్‌రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘బోళా శంకర్’ సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కీర్తీసురేష్ కూడా బోళాశంకర్ సెట్స్‌లో జాయినయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సిస్టర్ పాత్రలో కనిపిస్తారు కీర్తీసురేశ్. ఇక తమిళం హిట్ అజిత్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ‘బోళాశంకర్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది.