ప్యాన్ ఇండియన్ హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో సినిమా అనగానే కొందరు ఆశ్చర్యంగానే ఆలోచిస్తారు. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని తెలిసింది. మారుతి స్టైల్ ఆప్ కామెడీకి కాస్త హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు మారుతి. వరుస ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఫుల్బిజీగా ఉన్న ప్రభాస్ తెలుగులో ఓ మీడియం బడ్జెట్‌తో ఓ ఎంటర్టైనర్ చేయాలని ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నాడు కానీ కుదరడం
లేదు. ఇప్పుడు కుదిరింది. ‘రాజా డీలక్స్’గా టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
ఇక ఇప్పటికే ‘రాధేశ్యామ్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా ‘రాజా డీలక్స్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాయే కాకుండా.. నిర్మాత ‘దిల్’రాజు, మైత్రీమూవీమేకర్స్లతో సినిమాలు చేయడానికి ప్రభాస్ కమిట్మెంట్స్ ఇచ్చారు. దాదాపు 8 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో నాలుగు సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది కదూ!