నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు. తమిళంలో పార్తిబన్ చేసిన ఓత్త సెరుపు సైజు 7కి తెలుగు రీమేక్‌గా బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీస తెరకెక్కింది.