ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రై మ్ థ్రిల్లర్ ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించారు. తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’తో ఘనవిజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేష¯Œ ్సలో చిత్రీకరణ జరుపుతూ విజయవంతంగా ‘హైవే’ షూటింగ్ పూర్తయ్యింది.
చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ – ‘‘శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై ఒక డిఫరెంట్ క్రై మ్ థ్రిల్లర్ గా ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. హైవే మూవీ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో షూటింగ్ జరిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.
చిత్ర దర్శకుడు కేవీ గుహ¯Œ మాట్లాడుతూ – ‘‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వా¯Œ ్సడ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం హైవే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం’’ అన్నారు.