మూడు సంవత్సరాల క్రితం తమిళంలో విష్ణు విశాల్ హీరోగా చేసిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రాచ్చసన్’ మంచి హిట్‌గా నిలిచింది. రామ్‌కుమార్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఇదే సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’గా తీశారు దర్శకుడు రమేష్‌వర్మ. ఇప్పుడు ‘రాచ్చసన్’ హిందీలో (సిండ్రేల్లా) రీమేక్ అయ్యింది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్‌కుమార్ హీరోగా నటించారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా కనిపిస్తారు. అక్షయ్‌కుమార్‌తో ఇటీవల ‘బెల్‌బాటమ్’ తీసిన దర్శకుడు రంజిత్ ఎమ్ తివారియే ఈ చిత్రాన్నీ డైరెక్ట్ చేశారు. సిండ్రెల్లా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో విడుదల కానుందనేది బాలీవుడ్ టాక్. అలాగే ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమ్ అయ్యే చాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని బీటౌన్ టాక్.