చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు అక్టోబరు 09న అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది మే 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే చిరంజీవి, ఆ తర్వాత రామ్‌చరణ్ కరోనా బారిన పడ్డారు. ఇటు సెకండ్ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఫైనల్‌గా ఫిబ్రవరి 04 ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల తేదీ డిసెంబరు 17న ఆచార్య విడుదల కానుందని, పుష్ప రిలీజ్ వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా పడుతుందనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగానే సాగింది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదిగా ‘పుష్ప’ సినిమా విడుదల తేదీ మారేది లేదని, చెప్పినట్లుగానే డిసెంబరు 17న థియేటర్స్‌కు వస్తామని దర్శకుడు సుకుమార్ తేల్చీ చెప్పేశాడు. అంతే…హడావిడిగా ‘ఆచార్య’ సినిమా కొత్త పోస్టర్, విడుదల తేదీ అక్టోబరు 09 రాత్రి దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చేశాయి. మరి..ఈ ప్రకారం ఆచార్య సడన్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కు సుకుమారే కారణమయ్యారా?