‘ఆర్య’ సినిమా హీరోగా అల్లుఅర్జున్‌ను, దర్శకుడిగా సుకుమార్‌ను, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ. ‘ఆర్య’ ఇచ్చిన ఉత్సాహంతో అల్లుఅర్జున్, సుకుమార్‌ ‘ఆర్య 2’ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ సడన్‌గా ఇప్పుడు సుకుమార్‌ ‘ఆర్య 3’ ప్రస్తావనను తెచ్చాడు. ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లో ఆర్య 3 సినిమా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తోనే సుకుమార్‌ ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలు తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాక విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా కమిటైయ్యారు. ఈ మూడు సినిమాల విడుదల తర్వాత ‘ఆర్య 3’ ఉంటుందనుకోవచ్చు. అలాగే ‘పుష్ప’
చిత్రంలో సునీల్‌ మెయిన్‌ విలన్‌గా కనిపిస్తారని, ‘పుష్ప:ది రైజ్‌’ క్లైమాక్స్‌లో ఫాహద్‌ ఫాజిల్‌ ఎంట్రీ ఉంటుందని టాక్‌. ఇన్‌స్టా లైవ్‌లో ‘ఆర్య 3’ ఉంటుందని చెప్పిన సుకుమార్‌…ఇదే లైవ్‌ సెషన్‌లో ‘పుష్ప:ది రైజ్‌’ సినిమాను డిసెంబరు 17న విడుదల చేస్తామని, తగ్గెదేలే అన్నట్లు చెప్పారు.

By Vissu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *