Akhanda 100 Days krutagnata sabha ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అఖండ’. గత ఏడాది డిసెంబరు 2న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా వంద రోజుల వేడుకను కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగాఈ వేడుకలో
హీరో బాలకృష్ణ మాట్లాడుతూవందరోజుల వేడుక జరుపుకుని చాలా సంవత్సరాలైంది. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలకు మించి ‘అఖండ’ ఉండాలని మేం కోరుకోలేదు. కరోనా వల్ల ‘అఖండ’ సినిమా షూటింగ్ ఆగిపోయింది కూడా. కానీ నిర్మాత రవీందర్రెడ్డిగారి సహకారం వల్ల సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. భారతీయ హైందవ,సనాతన ధర్మాన్ని అఖండ చిత్రం మరోసారి గుర్తుచేసింది. ప్రకృతి, ధర్మం, మహిళలకు విపత్తులు కలిగిస్తే ఆ భగవంతుడే మనిషిలో ప్రవేశించి, అవధూతగా మారి శత్రుసంహారం చేస్తాడు. ‘అఖండ’లోని నా పాత్రతోదర్శకుడు ఇలాంటి ఓ సందేశాన్ని ఇచ్చారు. అఖండ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పొగిడారు. నేను ‘భైరవ దీపం’, ‘ఆదిత్య 369’ వంటి కృత్రిమ కథల సినిమాలు చేశాను. కానీ అఖండ ఇంత మంచి విజయం సాధించ డానికి ప్రేక్షకుల అభిమానమే కారణం. ఇక నా సినిమాలే నాకు పోటీ. సింహకు పోటీ లెజెండ్. లెజెండ్‌కు పోటీ అఖండ. ముందు ముందు మరిన్ని సినిమాలు మా నుంచి తయారువుతాయి. సినిమాను పరిశ్రమగా గుర్తించా లని ప్రభుత్వాలను గతంలో అడిగాం.బోయపాటి శ్రీనుతో నా జర్నీ కొనసాగుతుంది. ‘అఖండ’ సినిమాకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూదర్శకుడిగా నా మూడోసినిమా తులసీ తర్వాత బాలయ్యగారితో ‘సింహా’ ఒకే అయ్యింది. అలా తొలి అడుగు వేశాం. లెజెండ్ సినిమాతో రెండో అడుగు. ఇప్పుడు అఖండతో మూడో అడుగు. నేను, బాలయ్యగారు చేసిన ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. ప్రకృతి, దైవం, ధర్మం వంటి అంశాల గురించి కమర్షియల్‌గా చెప్పడం కష్టం. అఖండతో అది కుదిరింది.
ఈ వేడుకలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, నటీనటులు నటి పూర్ణ, శ్రీకాంత్, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, కెమెరామెన్ రాం ప్రసాద్, చమక్ చంద్ర, కోటేశ్వరరావు, స్టన్ శివ తదితరులు మాట్లాడారు.