Runway34:: అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన తారాగణంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రన్ వే 34’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అజయ్‌దేవగన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతోపాటుగా ఈ సినిమాకు దర్శకత్వమూ వహించారు. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడు దల కానుంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌తో పాటు, మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ‘‘35 వేలఅడుగుల ఎత్తులో నిజం దాగి ఉంది’’ అని పోస్టర్‌పై ఉండటం ఈ సినిమాపై ఆసక్తినికి కలిగిస్తోంది. ఫ్లైట్ హైజాకింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉండేట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ సినిమాకు మేడే అనే టైటిల్ పెట్టారు కానీ ఫైనల్‌గా రన్ వే 34 అని ఫైనలైజ్ చేశారు.
Runway34:35 వేల అడుగుల ఎత్తులో నిజం!
Leave a comment
Leave a comment