Chiranjeevi: మలయాళంలో హిట్ సాధించిన ‘లూసీఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సత్యదేవ్, నయనతార, సునీల్, బ్రహ్మాజీ, సల్మాన్‌ఖాన్ కనిపిస్తారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మలయాళ లూసీఫర్‌లో మోహన్‌లాల్ చేసిన పాత్ర చిరంజీవి చేస్తుండగా, పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్‌ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాల నుకుంటున్నారు.
Chiranjeevi: ముంబైలో గాడ్‌ఫాదర్
Leave a comment
Leave a comment