నటులు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉంటాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ (20 10), ‘లెజెండ్’(2014), ‘అఖండ’(2021) సాధించిన అద్భుత విజయాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా అయితే బాక్సాఫీస్ ప్రభంజనాన్ని సృష్టించింది. ఎంతలా అంటే ఈసినిమాను ఆ తర్వాత హిందీలో కూడా రిలీజ్ చేశారు.
కాగా, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగో సినిమా రూపుదిద్దుకునేందుకు సన్నాహాలు మొదలైయ్యాయని తెలుస్తుంది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా వీరిద్దరి కలయికలోని నాలుగో సినిమాను గురించిన అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం జరగుతోంది.
అఖండ సీక్వెల్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోయే సినిమా ‘అఖండ’కు సీక్వెల్‌గా ఉండే చాన్సెస్ కనిపి స్తున్నాయి. రీసెంట్గా ‘అఖండ’ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన వర్క్స్‌కు పని చేస్తున్నట్లుగా తమన్ ట్వీట్ చేశారు.
HARA HARA MAHADEV 🥁
AUM NAMA SHIVAYA 🔥#MahaShivaratri ⭐️
Trust in God 🔥#Akhanda 💥💥💥💥💥💥💥💥💥💥
God bless
Let’s meet soon in #Akhanda2 💫☄️ pic.twitter.com/LXVdq7pY5u
— thaman S (@MusicThaman) February 18, 2023
బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదని, ఏపీ ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ తరుణంలో వీరిద్దరు చేయబోయేది ఓ పొలిటికల్ సబ్జెక్ట్అనే టాక్ కూడ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తుంది. అయితే ఈ పూర్తి విషయాలపై అధికారిక ప్రకటనలు రావాల్సిఉంది.
ప్రస్తుతం దర్శకుడు అనిల్రావిపూడితో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఇటు రామ్‌తో వర్క్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను.