Mokshagna : బాలకృష్ణ సమకాలీన హీరోలు చిరంజీవి, నాగార్జున వారసత్వం ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ విషయంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీని గురించిన వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ హిట్ ఫిల్మ్స్ ఆదిత్య 369 సీక్వెల్, భైరవద్వీపం సీక్వెల్ చిత్రాలతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే వార్తలు రెండేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ హీరోగా తగ్గ ఫిట్నెస్ ఒకప్పుడు లేదు. కానీ రీసెంట్‌టైమ్స్‌లో మోక్షజ్ఞ భలే ఫిట్ అయ్యారు. హీరోమేకోవర్కు రెడీ అయ్యారు. దీంతో నందమూరి అభిమానులు చాలామంది మోక్షజ్ఞ ఎంట్రీ పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో
ఉంటుందని తెలిసింది. ఇండస్ట్రీలో మహేశ్‌బాబు, ప్రభాస్…ఇటీవల విరాట్‌కర్ణ(పెదకాపు 1) సినిమా హీరో. ఇలా దాదాపు 50మందికి పైగా ప్రముఖులకు యాక్టింగ్‌లో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమచారం. బాలకృష్ణ ఆజ్ఞల మేరకే ఈ శిక్షణ జరుగుతుందని తెలిసింది. అన్నీ కుదిరితే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుంది. షూటింగ్ కాస్త ఆలస్యమైతే …2025లో ఉంటుంది. కానీ ఎంట్రీ మాత్రం పక్కా తెలుస్తోంది. ఇది నందమూరి ఫ్యాన్స్‌కు మాంచి గుడ్ న్యూసే అనుకోవచ్చు.
Mokshagna: బాలకృష్ణ ఆజ్ఞ…రెడీ అన్న మోక్షజ్ఞ?
బాలకృష్ణ సమకాలీన హీరోలు చిరంజీవి, నాగార్జున వారసత్వం ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ విషయంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీని గురించిన వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి.
Leave a comment
Leave a comment