ప్రధాన తారాగణం: అనన్యానాగళ్ళ, సలోని, ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ,మీసాల లక్ష్మణ్
దర్శకుడు శ్రీనివాస్ గోపీశెట్టి
నిర్మాత పి నరేశ్‌బాబు, రవి చైతన్య
సంగీత దర్శకుడు: ఆర్ఆర్ ధ్రువన్
కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయభాస్కర్
ఎడిటింగ్ ఉద్ధవ్
కథ
ఓ ఊర్లో రేఖ (అనన్యా నాగళ్ల), తేజు (ధనుష్ రఘుముద్రి) ప్రేమికులు. క్షుద్రపూజలో భాగంగా గర్భవతి కాబడిన రాజ్యలక్ష్మీ కుమార్తె రేఖ. దీంతో రేఖకు క్షుద్రశక్తులు పుట్టుకతోనే వస్తాయి. రేఖ ఆత్మలను చూడగలదు. వాటితో మాట్లాడగలదు. అయితే రేఖను కపాలికి బలి ఇవ్వాలని విగతి(టెంపర్ వంశీ) ప్రయత్నిస్తుంటాడు. అసలు..రేఖ తల్లి రాజ్యలక్ష్మీపై క్షుద్రపూజ చేసింది ఎవరు? రాజ్యలక్ష్మీ చావుకు కారకులు ఎవరు?ఇందులో రేఖ తండ్రి పాత్ర ఏమిటి? రేఖకు తేజు, శంకర్(మీసాల లక్ష్మణ్) ఏ విధంగా సహాయం చేశారు? విగతి తన లక్ష్యసాధనలో విజయం సాధించాడా? లేదా? అనేది మిగిలిన కథ
విశ్లేషణ
హారర్ కథకు రివెంజ్, లవ్, మదర్ సెంటిమెంట్ అంశాలను జోడించి కథ రాసుకున్నాడు దర్శకుడు. రేఖ, తేజుల లవ్‌స్టోరీ, రేఖ స్నేహితురాలు శైలజను ఓ మాంత్రికుడు నుంచి కాపాడటం, రేఖపై క్షుద్రపూజ జరిగినట్లు, ఆమె అమాయకురాలైనట్లుగా చూపించడం, రేఖకు సహాయం చేసే బాబా హత్య, క్షుద్రపూజలనుగురించి తేజుకు శంకర్ అవగాహన కల్పించడం, రేఖను విగతి బలించే ప్రయత్నాలు చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. రేఖ నిజ స్వరూపం తేజు తెలుసుకోవడం, రాజ్యలక్ష్మీ ప్లాష్‌బ్యాక్ ఎపి సోడ్, రేఖ– విగతిల మధ్య వార్ సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.
Razakar Review: రజాకార్ రివ్యూ
హారర్ సీన్‌తో సినిమా మొదలైనా ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు ఈ సినిమా ఓ రొమాంటిక్ సినిమా అన్నట్లు కథనం సాగుతుంది. తీసుకున్న స్టోరీ లైన్‌కు ఇంతలాంగ్ రొమాంటిక్ ట్రాక్ నప్పినట్లుగా అని పించ దు. ఈ రొమాంటిక్ తంతు సెకండాఫ్‌లోనూ అక్కడక్కడ ఆడియన్స్‌ను విసుగెత్తిస్తుంది. రాజ్యలక్ష్మీ ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్ ఆసక్తికరంగా ఏమంత ఆసక్తికరంగా ఉండదు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ఓ బ్యాక్ స్టోరీతో ఆడియన్స్‌ను సహానాన్ని టెస్ట్ చేశాడు దర్శకుడు. శైలజను తేజు కాపాడే సీన్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ లాజిక్‌ను మిస్ చేశాడు దర్శకుడు ఇక్కడ. శవసాధన, రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహాంకాళి, వజ్రోలి రతి, చిన్నముస్తాదేవి….ఇలా ఆరు భాగాలుగా కథను దర్శకుడు ముందుకు నడిపాడు. ఇక్కడ దర్శకుడి ప్రతిభ, పరిశోధనను మెచ్చుకోవాలి. కానీ వీటిని కథలో ఏంగేజింగ్గా చెప్పడంలో విఫలమైయ్యాడు దర్శకుడు. కోర్ ఎమోషన్ మిస్ అయిన లోటు కనిపిస్తుంది. విలన్‌గా విగతను చంపిన దర్శకుడు, సైలెంట్ విలన్ అయిన రాజ్యలక్ష్మీ భర్త పాత్ర కుమార్‌ను అలా వదలేయడం ఏంటో అర్థం కాదు. రేఖ పాత్ర కూడా కుమార్ పాత్రపై రివెంజ్ తీసుకోదు. కథలో ఇదో మైనస్. సినిమా అంత కాదు..కానీ హారర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే వారికి కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి.
నటీనటులు
రేఖ పాత్రలో అనాన్యనాగళ్ల కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు.రొమాంటిక్ సీన్స్ బాగుంటాయి కానీ హారర్ సీన్స్‌లో అనన్య యాక్టింగ్ కాస్త మెరుగుపడాల్సి ఉంటుంది. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌లో హారర్ తాలుకూ ఇంటెన్స్ కనిపించదు. ఇక కథ మొత్తం «తేజు పాత్రలో ధనుష్ రఘుముద్రి పాత్ర ఓ ప్రేక్షకుడి మాదరిగానే ఉంటుంది. సినిమాలోని మిగతా క్యారెక్టర్లు మిసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ, గుడిలో పూజారి, రేఖ చెప్పే కథలు వినడానికే అతని పాత్ర పరిమితమైంది. పెద్దగా యాక్టింగ్ ఉన్న స్కోప్ ఉన్న రోల్ అయితే కాదు. అలాఅనీ మిసాల లక్ష్మణ్ రోల్ కూడా ఇంపాక్ట్ ఏం లేదు. కథలు చెప్పడానికే సరిపోతుంది. టెంపర్ వంశీ పాత్ర కూడా ఆల్మోస్ట్ ఇంతే. అప్పడుడప్పుడు మంత్రాలు చదవడం బోనస్. ఇక రాజ్యలక్ష్మీ పాత్రలో సలోనికి మంచి క్యారెక్టర్ దక్కినట్లే. కానీ స్క్రీన్ స్పేస్‌తో పాటు, డైలాగ్స్ కూడా తక్కువే. సాంకేతిక విలువలు. హారర్ అంటే మంచి సౌండ్ ఉండాలి. ఈ సినిమాలో సౌండ్ ఉంటుంది కానీ భయపెట్టడదు. వినపడుతుంది అంతే. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏం లేవు. ఓ రోడ్, ఓ ఇల్లు, స్మశానం అంతే. కెమెరా పనితనం అంత గొప్పగా ఏం అనిపించదు. ఎడిటింగ్ చాలనే చేయవచ్చు.