Gangs of Godavari: విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో ఒకటి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) నేహాశెట్టి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ అంజలి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తొలుత ఈ సినిమా డిసెంబరు 8న రిలీజ్‌కు ప్రకటించారు. కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయన్న టాక్ వినిపించింది. కానీ మార్చి 8న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నారు అప్పట్లో. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సోదరి భవతారిణి హఠాన్మరణంతో మ్యూజిక్ వర్క్స్ స్పీడ్ అందుకోకపోవడం, షూట్ కూడా బ్యాలెన్స్ ఉండటంతో అప్పట్లో ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమాను లేటెస్ట్గా మే 17న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు. 1960 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఓ సాధారణ వ్యక్తి ఓ సిండికేట్‌ను రన్ చేసే డాన్‌గా ఎలా ఎదుగుతాడు? అన్నదే ఈ చిత్రం కథ. విశ్వక్సేన్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి.
ఈ సినిమాలు కాకుండా ‘లైలా’, ‘మెకానిక్ రాఖీ’ సినిమాలకు కమిటైయ్యారు విశ్వక్. అలాగే సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్లో విశ్వక్సేన్ హీరోగా ఓ సినిమా రానుంది.