ఫలక్‌నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. మంగళ వారం ఈ సినిమా నుంచి ‘సిన్నవాడా ..’ అనే పాట విడుదలైంది.
పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలో తెలియని ఓ గందరగోళం, చిన్నపాటి ఆతృత ఉంటాయి. వాటిని గురించి ప్రస్తావించేలా ‘సిన్నవాడా..’ సాంగ్ ఉంది. జానపదంలో సాగేలా పాట ఉండటంతో పాట వింటుంటే డిఫరెంట్‌గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. జై క్రిష్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని సిన్నవాడా పాటకు అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్ తమ గొంతుకలతో ఓ కొత్తదనాన్ని అందించారు.
ఈ ఇంట్రెస్టింగ్.. ఎంటర్టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.