ఇంతకుముందు ఏప్రిల్ 25న లేదా మార్చి 4న తమ సినిమాను విడుదల చేయనున్నట్లు గని చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఏప్రిల్ 25ననే ‘గని’ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు వరుణ్‌తేజ్. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, ఉపేంద్ర, సునీల్‌శెట్టి కీలక
పాత్రలు పోషించారు. ఇందులో వరుణ్‌తేజ్ ‘గని’ అనే బాక్సర్ పాత్రలో కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధుముద్ద నిర్మించిన గని సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
గని సినిమా ఫిబ్రవరి 25కు రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకోవడంతో భీమ్లానాయక్ చిత్రం ఏప్రిల్ 1న విడుదల అవుతుందని తెలుస్తోంది. ‘ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని విడుదల చేస్తామని గతంలో ఈ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. తాజాగా ఫిబ్రవరి 25న గని రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకోవడంతో భీమ్లానాయక్ రిలీజ్ ఏప్రిల్1కి ఫక్సయిందని అనుకోవచ్చు. అయితే ఈ విషయంపై
క్లారిటీ రావాల్సింది. పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా సాగర్‌కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు సంగీతం అందించారు. మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా భీమ్లానాయక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.