Ukranian Beauty Maria Ryaboshapka: శివకార్తికేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కను తీసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించింది. పాండిచ్చేరి, లండన్ బ్యాక్‌డ్రాప్స్‌లో కాలేజీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో తెలుగు లెక్చలర్‌గా శివ కార్తికేయన్, ఇంగ్లీష్‌టీచర్‌గా మరియా కనిపిస్తారట. డి.సురేష్‌బాబు, నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అరుణ్ విశ్వ సహ నిర్మాత. తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు.
Readmore Akshaykumar Selfiee: అక్షయ్ ఖాతాలో మరో మలయాళ రీమేక్

