Akshaykumar Selfiee: అక్షయ్‌కుమార్, ఇమ్రాన్హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ సినిమాలో హీరోయిన్స్ ఖరారై య్యారు. ఈ చిత్రంలో నుష్రత్, డయానా పెంటీ హీరోయిన్స్‌గా నటిస్తారు. ప్రస్తుతం ఈసినిమా (Akshaykumar Selfiee) షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో డిఫరెంట్ లొకేషన్స్‌లో జరుగుతోంది. రాజ్ మెహతా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో స్టార్ హీరోగా ఇమ్రాన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా అక్షయ్ కనిపిస్తారు.
ఇక మలాయళంలో సూపర్‌హిట్ సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’కు హిందీలో రీమేక్‌గా ‘సెల్ఫీ’ తెరకెక్కుతోంది. సచీ(అయ్యప్పనుమ్ కోషియుమ్’ దర్శకుడు, గత ఏడాది మరణించారు)ఈ సినిమాకు కథ అందించారు. జూనియర్ లాల్ దర్శకత్వం వహించారు. పృధ్వీరాజ్ సుకు మారన్, సూరజ్ ప్రధాన పాత్రలు పోషించారు. తన అభిమాన స్టార్ హీరోతో ఫోటో దిగాల నుకునే ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తపన ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నదే ‘డైవింగ్ లైసెన్స్’ చిత్రం. హీరోగా పృధ్వీరాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా సూరజ్ కనిపిస్తారు.