

సినిమా: బీస్ట్
ప్రధానతారాగణం: విజయ్, పూజాహెగ్డే, సెల్వరాఘవన్
నిర్మాణం: సన్‌పిక్చర్స్ (కళానిధిమారన్)
మ్యూజిక్: అనిరు«ద్
విడుదల: 13 ఏప్రిల్ 2022
స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బీస్ట్’ (Vijay Beast Review) పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రెలర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. పైగా ‘బీస్ట్’ సినిమాను ఒకేసారి ఇతరభాషల్లో కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ ఫిల్మ్‌కు నెల్సన్‌కుమార్ డైరెక్టర్. నెల్సన్ ఇదవరకు తమిళంలో కోలమావుకోకిల, డాక్టర్ చిత్రాలను తీశారు. ఈ రెండుచిత్రాలూ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లోనివే. విజయ్‌తో నెల్సన్ ఇప్పుడు తీసిన ‘బీస్ట్’ కూడా క్రైమ్ బ్యాక్‌డ్రాప్ మూవీ. హోస్టేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం.
కథ: పాకిస్తాన్ ఉగ్రవాది ఉమర్ ఫరూక్‌ను బందీగా భారతదేశానికి తీసుకుని వచ్చేందుకు రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ వీరారాఘవన్ (విజయ్) ఓ మిషన్‌లో భాగంగా రాజస్తాన్‌లో జోద్‌పూర్‌లో మఫ్తీలో ఉంటాడు. మూడు నెలలు రెక్కీ చేసి, ఫరూక్‌ను తీసుకుని వచ్చేందుకు పక్కా స్కేచ్‌ను వీరరాఘవన్ రెడీ చేసు కున్న తర్వాత ఈ మిషన్‌ను క్యాన్సిల్స్ చేయాలని పై అధికారులు ఆర్డర్ వేస్తారు? కానీ వీరరాఘవన్ అతన్నీపట్టుకునే క్రమంలో ఓ పాప మరణిస్తుంది. దీంతో తన వల్లే ఆ పాప చనిపోయిందన్న బాధతో వీరరాఘవన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఓ సైకాలజీ డాక్టర్ వద్ద విక్షణ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వీరరాఘవన్‌కు, ఈ డాక్టర్ ద్వారా ప్రీతి (పూజీహెగ్డే) పరిచయం అవుతుంది. ప్రీతి సాయంతో ఓ సెక్యూరిటీ ఆఫీస్‌లో సెక్యూరిటీగా జాబ్ సంపాదిస్తాడు వీరరాఘవన్. ఓ షాపింగ్‌మాల్ సెక్యూరిటీ పర్సప్ కింద విజయ్ అతని టీమ్ వెళ్లి ఉగ్ర వాదుల హోస్టేజ్‌లో చిక్కుకుంటారు. షాపింగ్‌మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదాలు ఉమర్ ఫరూక్‌ను పాకిస్తాన్‌కు
తిరిగి పంపాల్సిందిగా షరతు పెడతారు. ఈ సమయంలో రా మాజీ ఏజెంట్‌గా వీరరాఘవన్ ఏం చేశాడు? ఉగ్రవాదాదులను ఎలా మట్టుపెట్టాడు? ఉగ్రవాదాలు డిమాండ్స్‌కు ప్రభుత్వం ఎలా స్పందించింది? అన్నదే కథ.


ఎలా ఉందంటే: ఓ చిన్నారి పాప మరణానికి పరోక్షంగా కారణమైయ్యాని బాధపడే ఓ మాజీ రా ఏజెంట్‌కు, కేంద్రప్రభుత్వం ఎలక్షన్స్‌కు ముడిపడిన అంశాలతో ‘బీస్ట్’ కథనం సాగుతుంది. రాజస్తాన్‌లో మొదలైన కథ ఆ తర్వాత పీఓకే (పాక్ ఆక్రమిత భారత ప్రాంతం)కి వెళ్తుంది. ఫరూక్‌ను పట్టుకోవడం, పాపచనిపోవడం, వీరరాఘవన్ ట్రీట్‌మెంట్, మధ్యలో అరబిక్ సాంగ్, షాపింగ్‌మాల్ హైజాక్ వంటి అంశాలతోనే కథ సాగుతూ ఉం టుంది. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులకు నెక్ట్స్ ఏం జరుగుతుందనే విషయం అర్థమైపోతుంటుంది. అయితేప్రీ ఇంట్రవెల్‌లో మినిస్టర్ భార్య, కూతుర్లను తన కంట్రోలోకి తీసుకుని ఉగ్రవాద నాయకుడిని వీరరాఘవన్‌బోల్తా కొట్టించే సీన్ బాగుంటుంది. అక్కడక్కడ కాస్త స్లో అయినా కూడా ఫస్టాప్ బాగనే ఉంటుంది. కానీ సెకండాఫ్ కాస్త బోరింగ్‌గా ఉంటుంది. వీరరాఘవన్ తాను బంగ్లాదేశ్ వ్యక్తిని చెప్పడం, ఉగ్రవాదా నాయకుడ్నీ కన్ ఫ్యూజ్ చేయడం ఇలాంటివి కొత్తగా ఏం అనిపించవు. అయితే ఓ హోస్టేజ్‌గా వచ్చి నిజం తెలుసుకున్న ఉగ్రవాద నాయకుడు తన కొత్త ప్లాన్‌ను రెడీ చేయడం, వీరరాఘవన్‌ను బంధించడం, రెడ్‌బాక్స్ అంటూ గేమ్ అతను తప్పించుకోవడం ఇవన్నీ రోటిన్ కథనాలే. సెకండాఫ్‌లో అంతా ఫైట్స్‌తోనే ఉంటుంది. అక్కడక్కడ కాస్త నవ్వులు ఉంటాయి. కానీ ఇవి ఏం అంత గుర్తుంచుకోదగ్గవి అయితే మాత్రం కాదు. క్లైమాక్స్ కూడా
ప్రేక్షకులు ప్రీ క్లైమాక్స్‌లోనే ఊహిస్తారు.
ఎలా చేశారంటే… కథ అంతా వీరరాఘవన్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. యాక్షన్ సీన్స్‌లో విజయ్ యాక్టింగ్ పరంగా దుమ్ములేపాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంట్రవెల్ బ్లాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. అక్కడక్కడ విజయ్ వేసే కామెడీ పంచ్‌లు ఒకే. ఉగ్రవాదులకు, ప్రభుత్వానికి, వీరరాఘవలకు మధ్య వారధి వేసే పాత్ర అప్తాజŒ పాత్రలో సెల్వరాఘవన్ ఉన్నమేరకు ఫర్వాలేదనిపించారు. ఇక హీరోయిన్ పూజాహెగ్డే పాత్రకు యాక్టింగ్ పరంగా పెద్దగా స్కోప్ లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలనే ఉంది. కానీ ‘అరబిక్..’సాంగ్‌లో పూజ డ్యాన్స్‌లు మెప్పిస్తాయి. ఇక ఎక్కువమంది క్యారెక్టర్స్‌ను ఓ గ్యాంగ్‌లా పెట్టడం, వారి మధ్య కామెడీని పండిస్తూనే కథను ముందకు నడిపే స్టైల్‌ను ‘బీస్ట్’ సినిమాకు అప్లై చేశారు దర్శకుడు నెల్సన్‌దిలీప్ కుమార్. ఇంతకుముందు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇదే ఫార్ములాతో ‘కోలమావుకోకిల’, ‘డాక్టర్’ సినిమాలను తీశారు. దర్శకుడు సెంకడాఫ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమా స్టార్టింగ్‌లో మిషన్‌పై వెళ్లిన వీరరాఘవన్‌ఫరూక్‌ను ఎలా అరెస్ట్ చేశాడు? అన్న విషయం సినిమాలో కనిపించదు. వీరరాఘవన్ రా ఏజెంట్‌గా రాజీనా మా చేసే సీన్స్ ఉండవు. సాగదీతగా ఉండే సెకండాఫ్‌లో కామెడీ ఉండదు. రోటిన్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. కానీ మ్యూజిక్ పరంగా అనిరు«ద్ ఫర్వాలేదనిపించాడు.


బలం
విజయ్ యాక్టింగ్
యాక్షన్ సీక్వెన్సెస్‌లు
బలహానతలు
కథనంలో లోటుపాట్లు
బోరింగ్ సెకండాఫ్
ఊహించగలిగే క్లైమాక్స్
ఫైనల్‌గా…ఫ్యాన్స్‌కు విజయ్ ‘బీస్ట్’
Acharya: ఆచార్య సినిమాలోని హైలైట్స్ ఇవే!

