తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన తమన్ తాజాగా మరో ప్యాన్ ఇండియన్ మూవీకి సైన్ చేశాడు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మిస్తున్న ప్యాన్‌ఇండియన్ మూవీకి తమన్ సంగీతం అందిం చనున్నారు. ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ సినిమాల తర్వాత రామ్‌చరణ్‌గారితో మరో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నా తమన్. ఇరవై సంవత్సరాలుగా దర్శకులు శంకర్‌ను చూస్తూనే ఉన్నాను. ఆయనలోని ఏనర్జీ ఏ మాత్రం తగ్గలేదని అంటూ, ఇండస్ట్రీలో తనకు ఓ బద్రర్‌లా ఉంటూ ప్రొత్సహిస్తున్న నిర్మాత ‘దిల్’ రాజుకు ధన్యవాదాలు అంటూ సోషల్‌మీడియాలో షేర్ చేశారు తమన్.
అయితే ఈ సినిమాకు ఆల్రేడీ తమన్ మ్యూజిక్ వర్క్‌ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 135 మందికిపై మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ సినిమాలోని రామ్‌చరణ్ ఇంట్రోసాంగ్ రికార్డింగ్‌ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారట తమన్. ఈ సినిమాకు కొరియో గ్రాఫర్‌గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.