రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శరత్ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ‘మజలీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరో యిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’యే తొలి చిత్రం కావడం విశేషం.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని రోజులుగా రవితేజ, దివ్యాంశ , రాజీషలపై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్సీ ఛాయాగ్రాహకులు. ప్రవీణ్ కేఎల్ ఈ చిత్రానికి ఎడిటర్. నాసిర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీ, మధుసూధన్ రావు, సురేఖ వాణి తదితరులు.

