Sreenu Vaitla D2: ‘వెంకీ’, ‘ఢీ’, ‘దుబాయ్శీను’, ‘దూకుడు’…ఇలాంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు శ్రీనువైట్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని, ఒకవేళ ‘వెంకీ 2’(Sreenu Vaitla D2) లో రవితేజ హీరోగా అయితేనే చేస్తాన్నట్లుగా చెప్పారు.
చెప్పాలంటే శ్రీనువైట్ల కెరీర్లో ‘వెంకీ’ ఎంతటి హిట్టో.. అంతకు కాస్త ఎక్కువే హిట్ కొట్టింది ‘ఢీ’ మూవీ. మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా ఇది. 2007 ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్గా నటించగా, శ్రీహరి ఓ కీలక పాత్రలో కనిపించారు.
‘ఢీ: డబుల్ డోస్’
అయితే దాదాపు 13 సంవత్సరాల తర్వాత 2020లో ‘ఢీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఢీ: డబుల్ డోస్’ అంటూ సినిమాను ప్రకటించారు శ్రీనువైట్ల.2020 నవంబరు 23 అంటే…మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. అదిగో సెట్స్‌పైకి వెళ్లుంది. ఇదిగో..షూటింగ్‌కు రెడీ అవుతున్నాం అంటూ….అప్పట్లోకాస్త హడావిడి జరిగిన ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది లేదు. ఆ తర్వాత ఏమైందో కానీ శ్రీనువైట్ల మరో సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ‘వెంకీ’ స్టార్ట్ చేయడానికి రెడీ అంటున్నారు శ్రీను వైట్ల.మరి..‘ఢీ 2’ సంగతి ఏంటి..ఆగిపోయినట్లేనా..అని అంటున్నారు నెటిజన్లు. మరోవైపు మంచు విష్ణు ప్రజెంట్ ‘కన్నప్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా.
MAA ManchuVishnu: తప్పుగా మాట్లాడిన మంచు విష్ణు..ఫైర్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్!
గోపీచంద్ విశ్వం
గోపీచంద్‌తో ప్రస్తుతం శ్రీనువైట్ల ‘విశ్వం’ సినిమా చేస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ వేణు దోనెపూడి ఈ సినిమా నిర్మాత. కానీ ఈ సినిమా చాలా ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కోటోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బడా నిర్మాణసంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేరికతో బలం చేకూరింది.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. వీలై తే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఓ దశలో షైన్‌స్క్రీన్ ప్రొడ్యూసర్ హరిష్పెద్ది జాయిన్ అయ్యారని, బడ్జెట్ ఇష్యూల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఫిల్మ్‌నగర్ గాసిప్ రాయుళ్ల మాట.