Sreeleela: ‘భీష్మ’ హిట్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ‘రాబిన్‌హుడ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా రష్మికా మందన్నాను తీసుకున్నారు. ‘భీష్మ’లో నితిన్, రష్మికామందన్నా జోడీగా నటించారు. ‘రాబిన్‌హుడ్’లో కూడా రిపీట్ కావాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల
ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు రష్మికామందన్నా. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ‘రాబిన్‌హుడ్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అన్నట్లు ‘ఎక్స్ట్రా’ సినిమా ప్రమోషన్స్‌లో నితిన్ స్వయంగా వెల్లడించారు. కానీ తొలిసారి నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్ ట్రా’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అప్పట్నుంచి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో శ్రీలీల పేరు వినిపించడం తక్కువైంది. పైగారిపబ్లిక్ డే సందర్భంగా ‘రాబిన్‌హుడ్’ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులోరాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా చిత్రంయూనిట్ ప్రకటించింది. కానీ హీరోయిన్గా శ్రీలీల పేరును ప్రకటించలేదు. దీంతో హీరోయిన్గా శ్రీలీలఫిక్స్ అయినప్పుడు ఆమె పేరును ప్రకటించడకుండ, ఎందుకు దాచి పెడుతున్నారో తెలియడం లేదు. పైగా శ్రీలీల హీరోయిన్గా నటించిన ఇటీవలి చిత్రాలు మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, రామ్ ‘స్కంథ’లు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచాయి. నితిన్ ‘ఎక్స్ట్రా’ కూడా ఫ్లాప్. ఇలా ఓ రకంగా శ్రీలీలకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని చెప్పొచ్చు.