‘గబ్బర్‌సింగ్’(2012) చిత్రం తర్వాత హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు హారిష్శంకర్ కాంబినేషన్లో రూపొం దుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్లునిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లుగా చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్, శ్రీలీల(Sreeleela) కాంబినేషన్స్లోని సీన్స్‌ను తీస్తున్నారు చిత్రంయూనిట్. కాగా తమిళ హిట్ ‘తేరీ’కి తెలుగు రీమేక్‌గా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది.