శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు
టీజర్ విడుదలైంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రష్మికా మందన్నా హీరో యిన్‌గా నటించిన ఈ సినిమాలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఆడవాళ్ళు మీకు జోహార్లు శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25నే థియే టర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ విడుదల
Leave a comment
Leave a comment