Samantha: ‘ది ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్లో రాజ్యలక్ష్మీ పాత్రలో సమంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసింది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్. అయితే ఇప్పుడు సమంత, యానిక్ బెన్ మరో ప్రాజెక్ట్ కోసం అసోసియేట్ అయ్యారు. కానీ ఇది ‘ది ఫ్యామిలీమ్యాన్’ థర్డ్ సీజన్ కోసం అయితే కాదు. సమంత నటిస్తున్న తాజా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘యశోద’ కోసం. హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. యశోద సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశాల కోసం సమంత, యానిక్ బెన్ వర్క్ చేశారు. పది రోజుల పాటు ఈ యాక్షన్
సన్నివేశాలను చిత్రీకరించడం విశేషం. అలాగే కొడైకెనాల్లో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను త్వరలో
చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన మూడుకోట్ల భారీ హోటల్ సెట్లో యశోద చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకుందన్, రావు రమేష్, మురళీ వర్మ, సంపత్‌నంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును ఆమె ప్రియుడు మోసం చేస్తాడు. ఈ మోసం నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నదే ‘యశోద’ కథనం అంట. యశోదగా సమంత, యశోదకు హెల్ప్ చేసే పాత్రలో వరలక్ష్మీ, యశోద ప్రియుడిగా ఉన్నిముకుందన్ కనిపిస్తారట. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మల యాళం భాషల్లో యశోద చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
Read more:మళ్లీ డైరెక్షన్ చైర్లో కూర్చొనున్న కన్నడ యాక్టర్