RRR: ఈ నెల 25న(మార్చి) ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం…రణం..రుధిరం) సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ పీరియా డికల్ ఫిల్మ్ ఇది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్, రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కథానాయిక లుగా నటించారు. 1920 ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహాం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లూరిసీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. అజయ్‌దేవగన్, శ్రియ, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కీలక పాత్రధారులు.
Contents
RRR: ఈ నెల 25న(మార్చి) ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం…రణం..రుధిరం) సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ పీరియా డికల్ ఫిల్మ్ ఇది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్, రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కథానాయిక లుగా నటించారు. 1920 ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహాం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లూరిసీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. అజయ్‌దేవగన్, శ్రియ, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కీలక పాత్రధారులు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ జరిగినా కూడా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిమాత్రమే మేజర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో హీరో యిన్‌గా చేసిన ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఈవెంట్స్‌లో మాత్రమే కనిపించారు తప్ప మరోమారు కనిపించలేదు. ఇక అజయ్‌దేవగన్ అయితే ముంబైలో జరిగిన ఒక్క ఆర్ఆర్ఆర్ ఈవెంట్లోనే దర్శనమిచ్చారు. అంతే ఆ తర్వాత ఏ ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్లోనూ కనిపిం చలేదు. పోనీ వీరు ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడానికి ఏమైనా ప్రత్యేకకారణాలు ఉన్నాయా?అంటే అదీ లేదు. అజయ్‌దేవగన్ తన లేటెస్ట్ ఫిల్మ్స్ ‘ఆర్వే 34’, తమిళం ఖైదీ రీమేక్ భోళతో అక్కడ బిజీగా ఉన్నాడు అంతే. ఆలియా ఎమో ముంబైలోని ఓ ప్రముఖ నిర్మాణసంస్థ ఆఫీసులో స్క్రిప్ట్ వర్క్ సెషన్స్‌లో పాల్గొంటుంది. ఇక శ్రియ మ్యూజికల్ స్కూల్ అనే సినిమా చేస్తోంది. కానీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనడం లేదు. సాధారణంగా సినిమాలోని స్టార్స్ అందర్నీ ప్రమోషన్స్‌కు తెలివిగా వాడుకునే రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో మరి. ‘ఆర్ఆర్ఆర్’ పలుమార్లు వాయిదా పడటంతో ప్రమోషన్స్‌కు ఆయా స్టార్స్ ఇచ్చిన కాల్షీట్స్ కంప్లీటైపోయి ఉండొచ్చు. దీంతో ప్రమోషన్స్ భారం అంతా అంతా తామై రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ చూసుకుంటున్నారు.