బాహుబలి తర్వాత రాజమౌళి (RRR Rajamouli) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రౌద్రం..రణం..రుధిరం (ఆర్ ఆర్ ఆర్).ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి(RRR Rajamouli) మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…
అలా చేస్తే ఆర్ ఆర్ ఆర్ ఫెయిల్ అవుతుంది – రాజమౌళి
– ఎన్టీఆర్,రామ్‌చరణ్‌ల ప్రతిభ, వ్యక్తిత్వం నాకు తెలుసు. అలాగే వీరిద్దరు మంచి స్నేహితులు. అందుకే స్నేహాం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని రామ్, భీమ్ పాత్రలకు వీరిద్దరిని తీసుకున్నాను. చరణ్ వ్యక్తి త్వాన్ని బట్టి రామ్ పాత్ర, ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని బట్టి భీమ్ పాత్ర ఇచ్చాను. ఆర్ఆర్ఆర్ ఫిక్షన్ స్టోరీ. సీక్వెల్స్
లేవు. వర్కింగ్ టైటిల్‌గా అనుకున్న ‘ఆర్ఆర్ఆర్’కు మంచి స్పందన రావడంతో దీన్నే టైటిల్‌గా ఫిక్స్ చేశాం.
– సినిమాలోని పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలన్న విషయాలగురించే ఆలోచించాను కానీ చరణ్‌కు ఎంత స్క్రీన్ టైమ్, ఎన్టీఆర్ ఏ పంచ్‌లైన్స్, ఎవరికి ఎంత స్క్రీన్ టైమ్ అనే లెక్కలు వేసుకోలేదు. అలా వేసుకుంటే
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఫెయిల్ అవుతుంది. ఆ లెక్కలతో సినిమా తీసినా అది హృదయం లేని చిత్రం అవు తుంది.
– కరోనా పరిస్థితుల వల్ల ఆర్ఆర్ఆర్ బడ్జెట్ పెరిగింది. కానీ కరోనా మమ్మల్నీ మాత్రమే కాదు. ప్రపంచవ్యప్తంగా అందర్నీ ఇబ్బంది పెట్టింది. అయితే కరోనా వల్ల మాకు లభించిన ఖాళీ సమయం ఆర్ఆర్ఆర్ను మరింత బెటర్‌గా చేయగలిగేలా చేశాం. కరోనా టైమ్‌లోనే ఆర్ఆర్ఆర్ త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్ చేశాం.
– ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాను ఒప్పుకోవడమే తారక్, చరణ్‌లు చేసిన పెద్ద త్యాగం. ఇక ప్రత్యేకంగావారు రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాల్సిన అవసరంలేదు. అయినా రెండున్నర సంవత్సరాలు
కరోనా వల్లే పోయింది కదా!
– ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియాభట్ ట్రైబల్ యువతిగా కాదు..విశాఖపట్నం ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. మనోధైర్యంతో ఉన్న ఓ అమాయకురాలి పాత్రకోసం ఆలియాభట్‌ను తీసుకున్నాం.
–రామ్‌చరణ్‌తో మగధీర సినిమా తీసిన తర్వాత వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే మరో భారీ బడ్జెట్ఫిల్మ్ చేయకూడదనే అనే అనుకున్నాను కానీ చేస్తున్నాను. ఈ విషయంలో రామ్‌గోపాల్‌వర్మగారి స్ఫూర్తితో
అబద్ధం చెప్పానుకోండి(సరదాగా..)
– ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్స్ లేవు. ఇది పూర్తిగా కల్పిత కథ. అయినా ఇలాంటి భారీ బడ్జెట్ ఫిల్మ్
తీసినప్పుడు బాధ్యతగా ఉండటానికే ప్రయత్నిస్తాం. అలాగే చేశాను.
నేను ఒక డైలాగ్ రాసుకుంటే…మిగతావి నా ఊహకు మాదిరిగా ఊహించుకుని తారక్ షాట్‌కు రెడీ అయిపోతాడు. ఇక తన పాత్ర గురించి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా సెట్స్ వచ్చీ దర్శకుడికి చరణ్ సరెండరైపోతారు.
ఆ బాధే ఎక్కువగా కలిగింది – ఎన్టీఆర్
– ప్రతి యాక్టర్లోని ప్లస్‌లు, మైనస్‌లు దర్శకులు తెలుసు. అలాగే మా యాక్టింగ్ గురించి రాజమౌళిగారికి తెలుసు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో మేం పోషించిన రామ్,భీమ్ పాత్రలు మా స్నేహాం ఎంత హెల్ప్ అయ్యిందో నాకు తెలీయదు కానీ, చరణ్‌తో నా స్నేహాం బలపడటానికి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ మరింత సహాయపడింది.
– కొత్త విషయాలు నేర్చుకోవడమో, రాజమౌళిగారితో తిట్లుతినడమో.. ప్రతీరోజూ సెట్స్‌లో కొత్తగా ఏదోఒకటి జరిగేది. ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 60 రాత్రులు షూట్ చేశాం. అప్పటివరకు మీరు చూసిన సినిమా అంతా ఆ ఇంట్రవెల్ పాయింట్‌కు వచ్చి ఆగుతుంది. . ఆర్ఆర్ఆర్ కల్పిత కథే, కాబట్టి ఎక్కువగా నేను నా కొమురం భీం పాత్రకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అజయ్దేవగన్గారితో మాకు కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ ఆలియాభట్‌తో ఉన్నాయి.
– చాలా ప్రమోషన్స్ చేశాం. ఆల్మోస్ట్ రిలీజ్ అనుకున్న టైమ్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది. వాయిదా
పడినందుకు కాదు కానీ మా కష్టాన్ని ఆడియన్స్ వెండితెరపై చూసేందుకు ఆలస్యం అవుతుందనే బాధే ఎక్కువగా కలిగింది
– ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా మల్టీస్టారర్ ఫిల్మ్స్ వస్తాయి. నాకు మహేశ్, బన్నీ, ప్రభాస్‌లతో పాటుగా బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్గార్లతో కూడా మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేయాలని ఉంది.
నా వంతు సహాయం చేశాను – రామ్‌చరణ్
– ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ నమ్మకంతోనే కరోనా సమయంలోనూ ధైర్యంగా ఉన్నాం. ఒత్తిడికి లోను కాలేదు.
– రామ్ పాత్రకు మేం పెద్దగా వర్క్షాష్స్ చేయలేదు. రామ్, భీమ్ క్యారక్టరైజేషన్స్కు సంబంధించిన విషయాలపై
మాత్రం రెండు రోజులు నేను, తారక్ పాల్గొన్నాం. బహుశా..మా కన్నా ఎక్కువగా ఎక్కువగా రాజమౌళిగారు ఎక్కువగా వర్క్‌షాప్స్ చేసినట్లు ఉన్నారు.
– ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రతిరోజూ కష్టంగానే అనిపించింది.
– సెట్స్‌లో తారక్ పెర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. తారక్‌ను చూసి, నేను ఇంకా బాగా చేయాలని తాపత్రయపడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ కూడా నా నుంచి నేర్చుకున్నా
నని చెబుతుంటారు.
– ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ కోసం కొన్ని సన్నివేశాలతో పాటుగా నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నాకు సెక్యూరిటీగా కొందరు ఉన్నారు. ఉక్రెయిన్ – రష్యాల యుద్ధం మొదలైన తర్వాత వారితో టచ్‌లోకి వెళ్లాను. 85సంవత్సరాల వయసులో కూడా తన తండ్రి యద్ధంలో పాల్గొంటున్న దారుణ పరిస్థితులు ఇక్కడ
ఉన్నాయని, సాయం కావాల్సిందిగా ఓ వ్యక్తి కోరారు. నాకు తోచింది చేశాను. అదీ సరిపోదని తెలుసు. నా వంతుగా చేయాల్సింది చేశాను అంతే.