Christmas2024: ఫెస్టివల్ సీజన్లో ఓ సినిమా విడుదలై, ప్రేక్షకాదరణకు నోచుకుంటే ఆ సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కేవలం ఫెస్టివల్ రిలీజŒ అడ్వాంటేజ్‌తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ ఏడాది క్రిస్మస్ ఫెస్టివల్‌కు సినిమాలను విడుదల చేసేందుకు ఆయా ఇండ స్ట్రీల దర్శక–నిర్మాతలు, హీరోలు పోటీపడుతున్నారు (Christmas2024).
MaharajaReview: విజయ్‌సేతుపతి మహారాజ రివ్యూ
టాలీవుడ్ విషయానికి వస్తే…నితిన్ ‘రాబిన్‌హుడ్’(Rabinhood) సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లుగా ఈ చిత్రం మేకర్స్ ప్రకటించారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అల్లు అర్జున్ (AlluArjun) ‘పుష్ప: ది రూల్ (PushpaTherule)’, రామ్‌చరణ్ (Ramcharan) ‘గేమ్‌చేంజర్ (Gamechanger)’, నాగచైతన్య ‘తండేల్’ సినిమాలు క్రిస్మస్ రిలీజ్‌ను టార్గెట్ చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘గేమ్‌చేంజర్’ లేదా ‘పుష్ప: ది రూల్’ సినిమాల్లో ఏ ఒక్కటీ క్రిస్మస్కు థియేటర్స్‌కు వచ్చినా.. మిగతా మీడియం హీరోల సినిమాలు వాయిదా పడతాయి.
tollywood:ప్రీ ప్రొడక్షన్స్‌లోనే ఫ్లాప్!
కానీ ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. ఎందుకంటే…హాలీవుడ్ చిత్రం ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమా డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హాలీవుడ్ చిత్రం ‘లయన్‌కింగ్’కు ప్రీక్వెల్ చిత్రం ఇది.
‘లయన్‌కింగ్’ సినిమాకు ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 170 కోట్ల రూపాయాల కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమాను ఇండియన్ ఆడియన్స్ ఎంతగా ఆదరించారో తెలుస్తోంది. ‘లయన్‌కింగ్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కాయి. ఈ నేపథ్యంలో ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమాకు పోటీగా ఏచిత్రం వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ తప్పక ఎఫెక్ట్ అవుతాయి. పైగా ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమా చిన్న పిల్లల సినిమా. కాబట్టి ఫ్యామిలీఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఈ సినిమాకే ఉండొచ్చు. ఇదే జరిగితే…క్రిస్మస్కు రిలీజ్ అయ్యే తెలుగు టాప్ స్టార్ హీరో సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ సైతం తగ్గుతా యనడంలో సందేహం లేదు. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. మరి..లయన్‌కింగ్‌కు పోటీగా నిలిచి, గెలిచే టాలీవుడ్ టాప్ స్టార్ హీరో మూవీ ఏదో చూద్దాం.