Saipallavu Hindi: సౌత్‌లో వన్నాఫ్‌ది టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయిపల్లవి హిందీలో తొలి అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు, దర్శక–నిర్మాత ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. సునీల్ పాండే ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జపాన్‌లో జరుగుతోంది. జునైద్, సాయిపల్లవిల కాంబినేషన్లో సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు ‘ఏక్ దిన్’(Ek Din)అనే టైటిల్‌ను చిత్రంయూనిట్ పరిశీలిస్తోందన్న టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక సాయిపల్లవి హిందీ ‘రామయణం’ సినిమాలోకూడా భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు నితీష్‌తివారి దర్శకుడు. ఈ సినిమాలే కాక..తెలుగులో నాగచైతన్యతో ‘తండేల్’, తమిళంలో శివకార్తీకేయన్‌తో‘అమరన్’ సినిమాలు చేస్తున్నారు సాయిపల్లవి. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలను సాయిపల్లవి భలేగాబ్యాలెన్స్ చేస్తున్నారనిపిస్తోంది కదు!
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే