RRR: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం. .రణం..రుధిరం) సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కనీసం 450 కోట్లను సాధిస్తేనే సేఫ్ (మిగతావి శాటిలైట్, డబ్బింగ్, రీమేక్ రైట్స్ వగైరా).
– ఆర్ఆర్ఆర్ సినిమా పక్కా కమర్షియల్ మూవీ కాదు. స్నేహం నేపథ్యంలో సాగే సినిమా. పైగా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఈ చిత్రం దర్శకుడు రాజమౌళియే వివిధ సందర్భాల్లో చెప్పారు. మరి..ఈ తరుణంలో బీసీ సెంటర్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్కు ఎంత దగ్గర అవుతారు అన్నదే ప్రధాన అంశం.
– ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుందని అంటున్నారు. క్లైమాక్స్‌లో శుభం కార్డులేని సినిమాలను
తెలుగు ప్రేక్షకులు మెచ్చుకున్న సందర్భాలు తక్కువ. పైగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డీలా పడే అవకాశాలు ఉన్నాయి.
– రామ్‌చరణ్‌తో అజయ్ దేవగన్‌కు కానీ, ఎన్టీఆర్‌తో అజయ్‌దేవగన్‌కు కానీ కాంబినేషన్ సీన్స్ లేవు. మరి..ఆర్ఆర్ఆర్ లో అజయ్‌దేవగన్ పాత్ర ఏమై ఉంటుంది? అనేది చూడాలి. పైగా ఒక్క ముంబైలో
జరిగిన ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ప్రమోషన్‌ను మినహాయించి అజయ్‌దేవగన్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో
పాల్గొనలేదు. ఇందుకు కారణాలే ఏవో తెలియదు. అలాగే ఆలియాభట్ది అతిథి పాత్రే అన్నట్లుగా రాజమౌళి
చెప్పారు. సో…సినిమా అంత నడవాల్సింది ఎన్టీఆర్, చరణ్లపైనే. మూడుగంటలకు పైగా రన్ టైమ్ ఉంది.
ఈ ఇద్దర్నే చూసేలా రాజమౌళి ఏం చేశారో చూడాలి.
– బాహుబలి సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కూ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ప్రధానంగా కొమురం భీం పాత్రలో చేసిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చేసిన రామ్‌చరణే కనిపిస్తారు. కానీ శ్రియ, అజయ్‌దేవగన్, సముద్రఖని పాత్రలు ఎంటీ? అనే విషయంపై ఓ క్లారిటీ లేదు. ఇక హాలీవుడ్ తారలు
రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ పెర్ఫార్మెన్స్కు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి.


– ఇప్పటివరకు రాజమమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల బ్యాక్‌డ్రాప్ ఇండియాలోనే ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ పూర్తిగా ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని ఓ ప్రెస్మీట్లో రాజమౌళి చెప్పారు. మరి..ఢిల్లీని
తెలుగురాష్ట్రాల ఆడియన్స్ ఓన్ చేసుకోగలరా?
– ఇక సినిమా టికెట్ ధరలు వీపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు రావాలంటే కనీసం రెండు మూడు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను
ఎంత ఆదరిస్తారనే విషయం కూడా కీలకమే. పైగా ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో కాలేజ్ స్టూడెంట్స్ వస్తారా? అనేది సందేహాం. ఇక ఓటీటీకి అలవాటు పడ్డవారు రెండు, మూడువేలు ఖర్చులు పెట్టుకుని థియేటర్స్ వచ్చి సినిమా చూస్తారా? అనేది మరో డౌట్. ఇక పైరసీ రాయుళ్లు ఆర్ఆర్ఆర్ వంటి
పెద్ద సినిమా వచ్చినప్పుడు లీక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి..ఆర్ఆర్ఆర్ టీమ్ వీటిని ఎలా కంట్రోల్
చేస్తుండో చూడాలి.
– ఇక సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ సినిమాలోని సీన్స్‌ను కట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. దీంతో కొంతమంది ఆడియన్స్‌కు థియేటర్స్‌కు వచ్చీ సినిమా చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది. మరి.. ఇది ఆర్ఆర్ఆర్ విషయంలో
ఎలా ఉంటుందో చూడాలి.


– ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన మరుసటి రోజు నుంచే ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) స్టార్ట్ అవుతుంది. ఈ తరుణంలో క్రికెట్ ఫ్యాన్స్ కొందరు ఆర్ఆర్ఆర్కు కాస్త దూరంగా ఉంటారు. తర్వాత చూస్తారు. ఇది ఫస్ట్
డే కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతుంది. మరి..ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ గండాలను దాటి బాక్సీఫీస్ కొండను
కొట్టాలనే సినీ లవర్స్ ఆశిస్తున్నారు. మరి..ఏం జరుగుతుందో చూడాలి. తమిళం, కన్నడం భాషల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా బుకింగ్స్ అంత ఏం బాగోలేవు. పైగా ఆర్ ఆర్ ఆర్ కన్నడ వెర్షన్ రిలీజ్ కావడం లేదుని, అక్కడ ఆర్ ఆర్ ఆర్‌ను బ్యాన్ చేయాలని కొందరు ట్వీట్స్ కూడా వేశారు.
Tollywood: టాలీవుడ్లో కొత్త ట్రెండ్…నిర్మాతల కొడుకులే హీరోలు