Hansika Motwani:హీరోయిన్ హాన్సిక నటించిన లేటెస్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ సినిమా నుంచి ‘రెప్పే వేసేలోగ మారిందెమో నా రాత’ అన్న లిరికల్ వీడియోను 2022 మార్చి 22న విడుదల చేశారు. హారికానారాయన్ ఆలపించిన ఈ పాటకు కె కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. శ్రీనివాస్ ఓం కార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మనుషుల చర్మం వొలిచి వ్యాపారం చేసే ఓ క్రూరమైన గ్యాంగ్‌తో పోరాడే యువతి శ్రుతీ పాత్రలో కనిపిస్తారు హాన్సిక(Hansika Motwani). ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Hansika Motwani: రెప్పే వేసేలోగ
Leave a comment
Leave a comment