రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈగల్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మాస్ డైలాగ్స్‌తో ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సంద ర్భంగా జనవరి 13న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్లో మల్టీషేడ్స్ ఉంటాయి.
గత ఏడాది సంక్రాంతికి చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో వచ్చారు రవితేజ. ఈ సినిమా హిట్ సాధించింది. ఇప్పుడు ఈ సంక్రాంతికి సోలో హీరోగా ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి..ఈ సంక్రాంతికి కూడా రవితేజ హిట్ అందుకుంటారా? లెట్స్ సీ. అయితే ఈ సంక్రాంతికి రవితేజ ‘ఈగల్’ సినిమాతో పాటుగా, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’, మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, తేజా సజ్జాల ‘హను–మాన్’ వంటి సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. సో..ఈ సంక్రాంతికి ఎవరికి హిట్ ఇస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. హిందీలో విజయం సాధించిన అజయ్‌దేవగన్ ‘రైడ్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్.