‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత దర్శకుడు హరీష్‌శంకర్‌తో కలిసి రవితేజ చేస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్‌తో సునా హోగా’ అనేది ట్యాగ్‌లైన్. భాగ్యశ్రీ భోర్సే ఈ చిత్రంలో హీరోయిన్గా నటి స్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. రవితేజతో పాటు సినిమాలో కొందరు కీలక తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబరు 28 నుంచి ప్రారంభించారు. కాగా హిందీలో 2018లో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన ‘రైడ్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రూపొందుతోంది. గతంలో ‘దబాంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా, ‘జిగర్తాండ’ను ‘గద్దలకొండ గణేష్’ రీమేక్ చేసి హిట్లు అందుకున్న దర్శకుడు హరీష్‌శంకర్ ‘మిస్టర్ బచ్చన్’తో రవితేజాకు మరో హిట్ ఇస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024