‘గుంటూరుకారం’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటించారు. మీనాక్షీచౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్న, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 21నుంచి మొదలైన సాంగ్ షూట్‌తో ‘గుంటూరుకారం’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మహేశ్ బాబు, శ్రీలీల కాంబినేషన్లో ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటతో షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా, మూడు పాటలు ఫస్టాప్‌లో, ఒక పాట సెకండాఫ్‌లో వస్తాయట.మదర్ సెంటిమెంట్‌కు పొలిటికల్ డ్రామాను మేళవించి ఈ సినిమాను తీశారట త్రివిక్రమ్. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. తమన్ ఈ సిని మాకు సంగీతం అందిస్తున్నారు.
Maheshbabu Gunturukaram :గుంటూరు కారం షూటింగ్ పూర్తి
Leave a comment
Leave a comment