‘రాధేశ్యామ్’, ‘సలార్’ సినిమాలు నిరాశపరిచిన ‘సలార్:సీజ్ఫైర్’తో సాలిడ్ హిట్ అందుకున్నారు ప్రభాస్. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయాల గ్రాస్ కలె క్షన్స్ను కొల్లగొట్టింది. ఇక ప్రభాస్ తర్వాతి సినిమాలను గురించిన చర్చ ఆయన ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో
ని సినిమా అప్డేట్ను తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు మేకర్స్. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. సంజయ్‌దత్, యోగిబాబు కీలక పాత్రధారులు. ఈ సినిమాకు ఇప్పటివరకు ‘రాజా డీలక్స్’, ‘అంబాసిడర్’, రాజాభాయ్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుందని తెలిసింది.
ఇక ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలోని సినిమా ‘కల్కి2898 ఏడీ’ 2025లో విడుదల కానుంది. అలాగే ప్రభాస్–సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లోని పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ కూడా 2025లోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.