Ramcharan17: ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో మూవీ (Ramcharan17) తెరకెక్కనుంది. మార్చి 25న ఈ సినిమాను గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీమూవీమేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను కూడానిర్మిస్తున్నారు. ‘రంగస్థలం’ సినిమాకు సంగీతం అందిం చిన దేవి శ్రీ ప్రసాద్యే ఈ సినిమాకు స్వరకర్త. ఓ రకంగా చెప్పాలంటే ‘రంగస్థలం’ టీమ్ అంతా మళ్లీ రీపీట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌చరణ్ కెరీర్లో 17వ సినిమాగా తెర కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికైతే 2025 చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
‘రంగస్థలం’ సినిమా గ్రామీణ నేపథ్యంలోసాగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని తెలిసింది. అంటే …సుకుమార్ఎన్టీఆర్తో తీసిన ‘నాన్నకు ప్రేమతో’, మహేశ్‌తో తీసిన ‘వన్: నెనొక్కడినే’ సినిమాల తరహాలో అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శీరిష్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటుగా రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో మూవీ ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతితెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ ఈ వేసవి తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సుకుమార్ డైరెక్షన్‌లోని సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ జాయిన్ అవుతారనిఊహించవచ్చు.