Ramcharan GameChanger: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీకాంత్, సునీల్, ఏస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సం దర్భం గా ఈ సినిమాకు ‘గేమ్‌చేంజర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రంయూనిట్. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించ నున్న సినిమా సెప్టెంబరులో షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది.
Ramcharan GameChanger: గేమ్‌ఛేంజర్‌గా రామ్‌చరణ్
Leave a comment
Leave a comment